పెళ్లైన హీరోతో రొమాన్స్ చేస్తానంటోంది..!

216
Fida Beauty Love Proposal to Married Hero
- Advertisement -

తన నటనతో, ముద్దు ముద్దు మాటలతో సినీ అభిమానుల మనసు దోచుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ప్రేమమ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రేమమ్, ఫిదా సక్సెస్‌లతో వరుస ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ లిస్ట్‌లో చేరిపోతున్నాయి. సాయిపల్లవి ఇప్పటికే న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఎంసీఏ చిత్రంలో నటిస్తోంది.  తమిళ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘మారి 2’ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇదిలావుంటే తమిళ సినీ పరిశ్రమలో ఉన్న సాయిపల్లవి హీరో సూర్య అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన సినిమాలు అస్సలు మిస్సయ్యేదాన్ని కాదని చెబుతోంది. అంతేకాదు సూర్య లాంటి హీరోతో రొమాన్స్ చేసే అవకాశం వస్తే ఎప్పుడూ తాను సిద్ధమేనని చెబుతోంది.

అయితే, ఈ ఫిదా భామతో నటించేందుకు చాలామంది హీరోలు  వెనుకంజ వేస్తున్నారట.  ‘ఫిదా’ సమయంలో వరుణ్‌ తేజ్‌తో , ప్రస్తుతం చేస్తున్న ‘ఎంసిఏ’ సినిమాలో నానితోనూ గొడవ పడిందన్న వార్తలు బాగానే హల్‌ చల్‌ చేస్తున్నాయి.

- Advertisement -