ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ రోజుల్లో, వివిధ దేశాలలో అనేక ప్రైవేటు సంస్థలు అనేక రకాలు గా విస్తరిస్తున్నాయి. అనేక ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. ప్రతిభ కలవారు, కేవలం తమ ప్రతిభ మాత్రమే కాక , వివిధ సంస్థలలో , తాము ఇతర ఉద్యోగులతోనూ , వారు పనిచేసే సంస్థ యాజమాన్యం తోనూ అనేక విధాలు గా కలిసి పోవడమే కాకుండా , తదనుగుణంగా వారు తమ పని సూత్రాలనూ , అంటే పని చేసే విధానాలనూ , పద్ధతులనూ కూడా మార్చు కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలన్నది సాధారణంగా ఈ రోజుల్లో వినబడే నీతి సూత్రం. అయితే చైనాలో మాత్రం కలిసిపోవడమంటే అలా కాదట. చైనాలోని టాంగ్ జ్యు జిల్లాలో ఉన్న ఈ కంపెనీలో అమ్మాయిలు పనిచేయాలంటే బాస్ తో ప్రతిరోజూ పెదవులు కలపాల్సిందే.
ఉదయం ఆఫీస్ కు రాగానే.. పొద్దున్నే 9 నుండి 9:30 మధ్యలో బాస్ ముందు క్యూ కట్టి కిస్ చేసే సెర్మనీకి హాజరు కావాలి. హాజరు కాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందే. చైనీస్ సోషల్ మీడియాలో ఓ వీడియో ఇపుడు వైరల్ అయింది. దీన్ని ఎవరో వీడియో తీసి చైనీస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఉద్యోగులంతా ప్రేయర్ చేయడానికి వచ్చినట్టు నిలబడతారు. బాస్ వచ్చి పెదవులు కలుపుకుంటూ పోతాడు. వారు కూడా ఉత్సాహంగా బాస్‌తో పెదవులు కలపడానికి ఉత్సాహం చూపిస్తారు.
దీనిపై అక్కడి మీడియా సదరు బాసుని వివరణ కోరగా.. ఇలా రోజు ఆఫీస్ ప్రారంభంలో పెదవులు కలిపితే స్టాఫ్‌కి మెనేజర్లకి మధ్య బంధం(చాప-నీటి బంధం లాగ) బలపడుతుందని అన్నారు. ఒకవేళ మెనేజర్ ఆ రోజు రాకపోతే కొందరు లేడి స్టాఫ్ బాగా మిస్ అవుతున్నట్లు మెస్సేజ్‌లు కూడా పంపుతారట. ఈ ఐడియాని అమెరికా కంపెనీల నుండే కాపీ కొట్టానని ఆ బాసు వెల్లడించాడు.
ఇలా ముద్దులు పెట్టలేమన్న పాపానికి గతంలో కొందరు రిజైన్ చేసి కూడా వెళ్లిపోయారట. ఇప్పుడీ వ్యవహారాన్ని ‘పీపుల్స్ డైలీ’ బట్టబయలు చేయగా, ఆ బాస్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫీమేల్ స్టాఫ్ ఎలా అగయిత్యానికి పాల్పడుతున్నారు..? వీరికి బాయ్ ఫ్రెండ్స్ కాని.. మొగుళ్లు కానీ లేరా..? అంటూ కొందరు కామెంట్లు చేయగా.. వీళ్లు బతకడానికి వేరే ఉద్యోగమే లేదా..? అని మరికొందరు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. ఆ ముద్దుల వీడియోను మీరూ చూడండి!
https://youtu.be/hhpwP-SDbfk