- Advertisement -
సీఎం కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17 సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో భారీ ఎత్తున మొక్కలు నాటి,ఆయనకు కానుకగా ఇవ్వాలని పిలపునిచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరవ్యాప్తంగా 2.5 లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నామని అందుకు తగ్గట్లు మొక్కల పంపిణీకి అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
నగరంలోని అన్ని వార్డుల్లో కార్పోరేటర్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మేయర్ తెలిపారు. మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే సీఎం పుట్టిన రోజు కానుకకు సార్థకత చేకూరుతుందన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సీఎం బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
- Advertisement -