ఈ నెల రెండో శనివారం వ‌ర్కింగ్ డే

304
Ghmc comissioner Lokesh Kumar
- Advertisement -

ఈ నెల 8న తేదీ రెండో శ‌నివారాన్ని ప‌నిదినంగా ప‌రిగ‌నించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌న‌వ‌రి 1వ తేదీని సెల‌వు దినంగా ప్ర‌క‌టించినందున, దానికి బ‌దులుగా ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ రెండో శ‌నివారం అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌నిచేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిపారు.

కావున జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ తో పాటు అన్ని జోన‌ల్‌, స‌ర్కిల్ కార్యాల‌యాలు య‌దావిధిగా ప‌నిచేయాల‌ని తెలిపారు. ఈ అంశంపై జోన‌ల్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, హెచ్‌.ఓ.డిలు త‌మ ప‌రిధిలోని ఉద్యోగుల‌కు త‌గు ఆదేశాలు జారీచేయాల‌ని సూచించారు.

- Advertisement -