20న సస్పెన్స్, థ్రిల్లర్..”ఫియర్”

5
- Advertisement -

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు “ఫియర్” సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా రిలీజ్ చేసిన “ఫియర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో “ఫియర్” సినిమా టీజర్ పై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన “ఫియర్” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

Also Read:బాలాపూర్ లడ్డూ @ 30 లక్షల వెయ్యి రూపాయలు

- Advertisement -