ట్రంప్‌ నివాసంలో ఎఫ్‌బీఐ ..!

45
trump
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించింది. విలాసవంతమైన ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లిగోలో సోదాలు నిర్వహించగా ఇప్పటి వరకు ఎఫ్‌బీఐ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

అయితే దీనిపై ట్రంప్ స్పందించారు. ఇది ఎఫ్‌బీఐ చర్య రాజకీయ ప్రతీకారమేనని ట్రంప్‌ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు ఇది గడ్డు కాలమని… ఇంతకు ముందు ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు.

దర్యాప్తు సంస్థకు సహకారం అందిస్తున్నప్పటికీ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నివాసంపై దాడి చేశారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే కరుడుగట్టిన డెమొక్రాట్ల దాడి ఇది అని ట్రంప్‌ విమర్శించారు.

- Advertisement -