Prabhas:ఫౌజీ అప్‌డేట్

3
- Advertisement -

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’కి సంబంధించిన కొత్త రిలీజ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటగా 2026 ఆగస్టు, స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ ప్లాన్ మారినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రభాస్ తన అన్ని డేట్స్‌ను ‘ఫౌజీ’కే కేటాయించినట్టు తెలుస్తోంది. సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని, ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ అనుభూతిని అందిస్తామని చిత్రబృందం హామీ ఇస్తోంది.

1940ల నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రం బ్రిటిష్ పాలన కాలంలోని సామాజిక–రాజకీయ ఉద్రిక్తతలతో పాటు మానవ భావోద్వేగాలను కూడా హృదయస్పర్శిగా చూపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, చైత్ర జే ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలవనుందని అంచనాలు ఉన్నాయి.

Also Read:దుకాణాల్లో హైడ్రా రంగనాథ్ తనిఖీలు

- Advertisement -