‘ఫ్యాటీలివర్’తో ప్రాణాలకే ముప్పు!

27
- Advertisement -

మన శరీర భాగాలన్నిటిలో లివర్ అత్యంత ముఖ్యమైనదని నిపుణులు చెబుతుంటారు. లివర్ ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కానీ లివర్ పాడైతే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మన శరీరంలో రక్తాన్ని శుద్ది చేయడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దాని పనితీరు ఏమాత్రం మందగించిన ముప్పు వాటిల్లుతుంది. అలాంటి లివర్ ను చాలమంది చెడు అలవాట్ల కారణంగా నాశనం చేసుకుంటున్నారు. విపరీతంగా మద్యం సేవించడం, కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగి లివర్ పై కొవ్వు పెరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్ కు కారణమౌతుంది. ఫ్యాటీలివర్ పెరిగితే అది అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది.

ముఖ్యంగా అధిక రక్తపోటు, కాలేయ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు.. ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడతాయి. అంతే కాకుండా మూత్రపిండాల పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహార డైట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యపానానికి పూర్తిగా దూరమవ్వాలి. తినే ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. గోదుమ, మిల్లెట్, జొన్న, మొక్కజొన్న, వంటి వాటిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. వీటితో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. అలాగే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇంకా మాంసాహారంలో బిఫ్, మటన్ వంటివి తగ్గించి, చేపలు, రొయ్యలు, పీతలు ఎక్కువగా తినాలి. తద్వారా లివర్ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఫ్యాటిలివర్ సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:టీ కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. బరిలోకి సోనియా?

- Advertisement -