హాట్‌ అందలతో ఫాతిమా షేక్‌ చేస్తుంది..

240
Fatima Sana Shaikh Trolled 'Again
- Advertisement -

పదేళ్లు పూర్తవ్వకముందే వెండితెరపై బాలనటిగా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్. మొదట్లో కాస్త చిన్న చిన్న పాత్రలు చేసిన అమ్మడు అమీర్ ఖాన్ – దంగళ్ సినిమాలో గీతా పొగాట్ పాత్రలో కనిపించి అందరి హార్ట్ ని టచ్ చేసింది. ఆ సినిమా ఇండియాలోనే కాదు చైనా లో కూడా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ అమ్మడు తాజ‌గా ‘థగ్స్ ఆఫ్ హిందొస్తాన్’ సినిమాలో అమీర్ తో జంట‌గా న‌టిస్తోంది.. కెరీర్ మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే దంగల్ తో మంచి గుర్తింపు వచ్చింది. కానీ గ్లామర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు చేసిన హీరోయిన్లకే ఇక్కడ కాలం చెల్లుతుంది. అది గ్రహించి ఇప్పుడు గ్లామ‌ర్ ఫోటో షూట్స్ లో చేస్తున్న‌ది. మొన్నటివరకు తాను గ్లామరసానికి చాలా దూరం అని చెప్పిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో బాగా తెలుసుకుంది. అందుకే ఈ ఫోటోలతో రెచ్చిపోతుంది ఈ దంగల్‌ భామ.

Fatima Sana Shaikh Trolled 'Again

ఈ దంగల్‌ బ్యూటి కి ఫ్యాన్స్‌ పాలోయింగ్‌ కూడా ఎక్కువే..ముఖ్యంగా దంగల్‌ మూవీలో ఫాతిమా నటనకు అందరు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా అమ్మడి మీద కాస్త గౌరవం కూడా పెరిగింది. కానీ ఫాతిమా మాత్రం ఎవరు ఉహించని విధంగా హాట్ లుక్స్ తో అందరిని షాక్ కి గురి చేసింది. ఏకంగా బికినీ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరు షాక్ అయ్యేలా చేసింది. దీంతో అమ్మడిపై నెగిటివ్ కామెంట్స్ చాలా వరకు వచ్చాయి. అప్పటి వరకు ఆమెతో సపోర్ట్ గా ఉన్న అభిమానులు కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. పైగా ముస్లిం అయ్యుండి రంజాన్ మాసంలో బికినీ వేసుకుంటావా అంటూ చాలామంది కమ్యునల్ కామెంట్లను కూడా చేసేశారు.

Fatima Sana Shaikh Trolled 'Again

కానీ ఈ అమ్మడు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన ఫ్యాషన్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే రీసెంట్ గా మరో ఫోటో షేర్ చేసి మరోసారి నెగిటివ్ కామెంట్స్ ని అందుకుంటోంది. చీర పద్దతిగా కట్టుకోకుండా కొంచెం వెరైటీగా కట్టుకొని స్పయిసీ లుక్స్ తో అద్దంలో చూస్తూ.. ఫోజు ఇచ్చేసింది ఫాతిమా. దీంతో నెటీజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే బుర్ఖా వేసుకోకుండా ఇదేంటి అంటున్నారట. ప్రస్తుతం అమ్మడు అమీర్ ఖాన్ – థంగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో నటిస్తోంది.

- Advertisement -