వారానికి రెండుసార్లు ఉపవాసంతో ఆరోగ్యంగా ఉండటమే కాదు క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని కొత్త అధ్యయనంలో తేలింది.ఉపవాసం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని వెల్లడైంది.
వాస్తవానికి ఉపవాసంతో బరువు తగ్గడం, మెరుగైన ప్రేగు ఆరోగ్యం, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక వారానికి రెండు రోజులు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధకుల బృందం తెలిపింది. న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
ఎలుకలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వారానికి రెండుసార్లు ఉపవాసం పాటించడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని తేలింది. ఉపవాసంతో బరువు తగ్గడమే కాదు ఆరోగ్యంగా ఉండవచ్చని తేలిందని ఆ స్టడీ సభ్యులు తెలిపారు.
Also Read:కీలక షెడ్యూల్‌లో నిఖిల్..స్వయంభూ!