ఉపవాసం చేయడం.. మంచిదేనా ?

71
- Advertisement -

ఏవైనా పండగలు వచ్చినప్పుడు లేదా భక్తి పేరుతో హోమాలు, వ్రతాలు, పూజలు చేసేటప్పుడు చాలా మంది ఉపవాసం చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా నీరు ఏ మాత్రం సేవించకుండా రోజంతా అలాగే గడిపేస్తూ ఉంటారు. కొందరు ఉపవాసం పేరుతో రోజుల తరబడి ఆహారాన్ని తీసుకోరు. అయితే ఇలా తరచూ ఉపవాసం ఉండడం వల్ల మంచిదేనా ? ఏమైనా నష్టాలు ఉన్నాయా ? అనే దానిపై చాలా మందికి స్పష్టత ఉండదు. కాబట్టి ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభనష్టాలను తెలుసుకుందాం !

ఉపవాసం చేయడం వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయి. నష్టాలు అంతకుమించి అనేలా ఉన్నాయి. వారంలో ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలోని గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది. వ్యాధులను తట్టుకునే శక్తితో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒంట్లోని కొలెస్ట్రాల్ శాతం తగ్గి హైబీపీ కంట్రోల్ లోకి వస్తుంది. ఉపవాసం కారణంగా రుమటాయిడ్, ఆర్థరైటిస్ సమస్యలు కూడా దూరం అవుతాయని పలు అధ్యయనలు చెబుతున్నాయి.

Also Read: KTR:ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ ఏమైంది?

అయితే ఉపవాసం ఎక్కువ రోజులు చేయడం వల్ల చాలానే నష్టాలు ఉన్నాయట. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, వంటి సమస్యలు చుట్టుముడతాయట. ఎందుకంటే ప్రతిరోజూ ఆహారం కోసం శరీరం ఒక నిర్ధిష్ట సమయానికి అలవాటు పడి ఉంటుంది. దాంతో భోజనం చేయకపోవడం వల్ల శరీరంలో చాలానే మార్పులు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరంగా తయారవుతుంది. కడుపు నొప్పి సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణ వ్యవస్థలో కూడా మార్పులు సంభవించి మలబద్దకం ఏర్పడుతుంది. ఈ కారణంగా అలసత్వం, నీరసం వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి వారంలో ఒకరోజు ఉపవాసం మంచిదే కానీ.. ఎక్కువ రోజులు ఉపవాసం చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: సూపర్ కాంబినేషన్..రోగాలన్నీ చెక్!

- Advertisement -