నవంబర్ నాలుగో తేదీన జరిగే మునుగోడు ఎన్నికల తర్వాత ఫామ్‌హౌస్ కేసు విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ఈ కేసు విచారణను నిలుపుదల చేయనున్నారు. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మొదటగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు పోలీసులను అనుమతించలేదు.అనంతరం ఏసీబీ కోర్టు నిబంధనల ప్రకారం నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. నిందితులను సైబరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. అయితే ఎట్టకేలకు మునుగోడు ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణను కోర్టు నిలిపివేసింది.తదుపరి విచారణ నవంబర్ నాలుగో తేదీ నుంచి జరగనుంది.
పోలీసుల పిటీషన్‌పై శుక్రవారం వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో కీలక వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంప్రదింపులు జరపరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..