రుణమాఫీ కాని రైతుల వినూత్న నిరసన

4
- Advertisement -

రుణమాఫీ కాని రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పట్టా పాస్‌బుక్‌లు చూపిస్తూ చేనులో దిగిన సెల్ఫీలను సీఎం కార్యాలయానికి పంపారు ముఖరా(కె) రైతులు.రూ. 2 లక్షలకు మించి బకాయిగల రైతులకు రుణమాఫీ చేయకపోవడంపై ఆందోళన చేపట్టారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

రుణమాఫీ కోసం రోడ్డెక్కారు రైతన్నలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు.రుణమాఫీ కాలేదని, కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఎస్బీఐ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించారు.

Also Read:సత్యం సుందరం.. హార్ట్ వార్మింగ్ మూవీ

- Advertisement -