ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన..

123
farm laws
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 71వ రోజుకు చేరింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో చర్చ జరిగిన అవి ఫలప్రదం కాలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు.

పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వస్తుండటంతో ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారీకేడ్లు, సిమెంట్ దిమ్మెలతో సరిహద్దులను మూసేశారు. అంతేకాదు, ఢిల్లీ సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఆందోళనలు మరింత ఉదృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 6 వ తేదీన రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధం చేసేందుకు రైతులు నడుం బిగించారు.

- Advertisement -