లగచర్ల లొల్లి మరువకముందే దిలావర్‌పూర్‌లో మొదలైంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన ఆర్డీవో రత్న కళ్యాణిని ఆరు గంటలకు పైగా రైతులు నిర్బంధించారు.కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని రైతులు భీష్మించుకుని ఉండగా వెళ్లిపోవాలని ప్రయత్నించిన ఆర్డీవో రత్న కళ్యాణిని అడ్డుకున్నారు.
ఆమె బీపీతో అస్వస్థతకు గురి కాగా భారీ పోలీసు బందోబస్తు నడుమ జిల్లా ఎస్పీ ఆమెను రక్షించేందుకు యత్నించగా మహిళలు దాడి చేయబోయారు.. అనంతరం ఆమెను ఎస్పీ తన కారులో ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో వెళ్లిపోయిన తరువాత ఆందోళనకారులు ఆమె కారు మీద దాడి చేసి ఎత్తి పక్కన పడేశారు.
దిలావర్‌పూర్‌లో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసు వాహనాలను రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.
Also Read:RGV:కేసులకు భయపడేది లేదు