రైతుకు యూరియాను కూడా ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అవసరమా..? అని రైతులు మండిపడుతున్నారు. మార్పు మార్పు అని .. మళ్లీ ఎరువుల కోసం గోసపడిన ఎనుకటి రోజులను తెచ్చారని వాపోతున్నారు రైతులు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జాఫర్ఘడ్ మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు ధర్నా చేపట్టారు. పంటలకు యూరియా అందించాల్సిన సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
యూరియా కొరత దెబ్బ స్థానిక ఎన్నికల్లో తప్పక చవి చూస్తావు రేవంత్! యూరియా కోసం రైతుల ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. 7 ఎకరాలకు రెండు బస్తాల యూరియానే ఇస్తే, రైతులం ఏమి అయిపోవాలె? అని మండిపడుతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టినం… యూరియా కూడా ఇచ్చే చేతనైతలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని దుయ్యబట్టారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మహిళా రైతుల ఆందోళన బాటపట్టారు. యూరియా కొరతను నిరసిస్తూ రైతులు వంటా వార్పు చేపట్టారు. 365 జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళనకు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు మహిళా రైతులు.
Also Read:‘మిరాయ్’..ఫాంటసీ ఎంటర్‌టైనర్

