రుణమాఫీపై రైతుల కన్నెర్ర…సీఎం రేవంత్ శవయాత్ర

8
- Advertisement -

రుణమాఫీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అతిపెద్ద మోసానికి పాల్పడ్డారని మండిపడుతున్నారు రైతులు. రైతులకు హక్కుగా రావాల్సిన యాసంగి రైతుబంధు, వానాకాలం రైతుబంధు డబ్బులు ఇవ్వకుండా ఆపి.. అవే డబ్బులతో కొంతమంది రైతులకు రుణమాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ కాలేదని రేవంత్ సర్కార్ పై కట్టలు రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలోని కెనరా బ్యాంకు ముందు రుణమాఫీ కాలేదని ధర్నా నిర్వహించారు.

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో రుణమాఫీ రాకపోవడంతో రోడ్డెక్కారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు డప్పు వాయిద్యాలతో శవయాత్ర నిర్వహించారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు చెప్పింది కొండంత..చేసింది రవ్వంత అని దుయ్యబట్టారు.

మూడు విడతలలో రూ.31 వేల కోట్లు ఆగస్ట్ 15 లోపు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న రూ.17,869 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పుకున్నారన్నారు. రూ.31 వేల కోట్లకు కేవలం 17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా అవుతుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని….సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:రుణ మాఫీ అర్హుల జాబితాను బయటపెట్టండి:బీజేపీ

- Advertisement -