రూ. లక్షలోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంకానుండగా సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిశేకాలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలోని దూది వెంకటాపురంలో నారుతో కేసీఆర్ అక్షరాలు పేర్చి రైతులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని సింగల్‌విండో కార్యాలయం ఎదుట రైతులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్, జై బీఆర్‌ఎస్ నినాదాలతో హోరెత్తించారు.
Also Read:అవయవదానం చేయండి… మరోసారి జీవించండి
ఆదిలాబాద్,వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. బోధ్ మండలం సోనాలలో రైతులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని జేపీ తండా, గట్ల మాల్యాల, సిద్దన్నపేట గ్రామాల ప్రజలు, రైతులు.. రుణమాఫీ చేసి మరోసారి రైతు బాంధవుడు అని నిరూపించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.
Also Read:TTD:4న డయల్ యువర్ ఈవో