బీఆర్ఎస్ ధర్నాలకు తరలివచ్చిన రైతులు..

7
- Advertisement -

రుణమాఫీ అమలు కోసం పోరుబాట పట్టింది బీఆర్ఎస్. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ధర్నాలను చేపట్టగా ఆలేరులో హరీశ్ రావు, చేవేళ్లలో కేటీఆర్ పాల్గొన్నారు.

అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవంత్‌ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌ రావు. రైతులందరికి రుణమాఫీ, పంటల బోనస్‌ ఇచ్చేంత వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు.

Also Read:Harish:ఎవరు రాజీనామా చేయాలో ప్రజలే తెలుస్తారు?

- Advertisement -