ధాన్యం కొంటలేరు.. కేసీఆర్‌కు రైతుల ఫిర్యాదు

21
- Advertisement -

కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న కేసీఆర్‌కు ఐకేపీ సెంటర్ దగ్గర గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరవై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు.కరెంటు లేదని.. రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.

మీరున్నప్పుడు నడి ఎండాకాలంల కూడా నీళ్లు మత్తళ్లు దునికేవి.. మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్… మల్లా మీ పాలనే రావాలని నినాదాలు…రైతు బంధు లేదు.. 500 బోనస్ అన్నరు అది బోగస్ అయింది.. మేము పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరు.. ఇగ బోనస్ ఏమిస్తారు సార్””.. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యింది అని గోడువెళ్లబోసుకున్నారు రైతన్నలు.

పోరాడి సాధించుకుందాం నీళ్లు కరెంటు మల్లా తెచ్చుకుందాం పోరాటానికి సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు కేసీఆర్. అంతకుముందు అన్నెపర్తి దగ్గెర కేసీఆర్ ను ఆపి ఇదే తరహాలో తమ గోడు వెల్లబోసుకున్నారు రైతన్నలు.

Also Read:KTR:బడే భాయ్..చోటా భాయ్..ఇద్దరు మోసగాళ్లే

- Advertisement -