కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. గంధమల్ల ప్రాజెక్టు కోసం మార్కెట్ రేటుకు సగం డబ్బులు ఇచ్చి భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఎం.తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులతో గంధమల్ల ప్రాజెక్టు భూసేకరణపై సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్. ఎకరా భూమికి కేవలం రూ.47 లక్షల పరిహారం ఇస్తామని తెలిపింది ప్రభుత్వం. ఎలాంటి గెజెట్ విడుదల చేయకుండా, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని, సమావేశంలో వీడియోలు తీయడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏంటని రైతులు ఎమ్మెల్యేని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు వదలకుండ గంధమల్ల నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం భూసర్వే కూడా సరిగ్గా చేయలేదని, తిరిగి భూసర్వే నిర్వహించాలని, అధికారిక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులు.

