కాంగ్రెస్‌ పాలనపై రైతుల కన్నెర్ర..

19
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు. రైతులు పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని.. వడ్లకు రూ.500 ల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.

వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతుందని రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇక కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ నేతలు.

Also Read:విశ్వంభరలో సీనియర్ హీరోయిన్!

- Advertisement -