తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందిపై పెట్రోల్ పోసిన రైతు

477
petrol in mro
- Advertisement -

ఇటివలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెర్వో విజయారెడ్డిపై రైతు సురేష్ పెట్రోల్ పోసి, సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇలాంటి ఘటన మరోసారి చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా లంబాడిపల్లెకి చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు.

తన భూమిని ఎంఆర్‌ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆరోపణలు చేశాడు. సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా చేయనట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని జేసీ శ్యామ్‌ప్రసాద్ లాల్.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, పెట్రోల్ చల్లిన రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుపై క్రిమినల్ కేసు నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు.

- Advertisement -