రష్మి బుల్లి తెరకేనా…?

144
Fans Worrying About Rashmi Gautam

అనసూయ, రష్మి.. ఇప్పుడు బుల్లి తెరపై ఆ యాంకర్‌లు మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.ఈ ఇద్దరూ బుల్లితెర హాట్ యాంకర్లుగా పాపులర్ అయినవారే. అప్పటివరకూ సుమ లాంటి వారు ట్రెడిషనల్‌గా వుంటే.. అనసూయ, రష్మిలు దాన్ని బ్రేక్ చేశారు. పొట్టి బట్టలతో ఈ హాట్ బ్యూటీస్ బుల్లితెరను హీటెక్కించారు. ఎంతగా అంటే హీరోయిన్ల రేంజ్‌లో ఈ ఇద్దరూ పాపులర్ అయ్యారు. దాంతో ఈ ఇద్దరికీ అటోమాటిగ్గా మూవీ ఆఫర్లు వచ్చాయి.రష్మిగౌతమ్‌ హీరోయిన్‌ గా ఒకటి రెండు సినిమాలు తీసినా ఈ సినిమాలు పెద్ద సక్సెస్‌ కాలేకపోయాయి.

Fans Worrying About Rashmi Gautam

బుల్లితెర యాంకర్ కాకముందు రష్మి సినిమాల్లో చేసి సక్సెస్ కాలేకపోయింది. తరువాత ‘గుంటూర్ టాకీస్’ లాంటి సినిమాలు చేస్తే.. అనసూయ మాత్రం సెలెక్టివ్‌గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ డిమాండ్ క్రియేట్ చేసుకుంటోంది. రష్మి మాత్రం సరైన ప్లానింగ్ లేక చిన్న చిన్న సినిమాలు చేసి.. ఉన్న డిమాండ్ అంతా పోగొట్టుకుంది. దాంతో ఇక రష్మి బుల్లితెరకే అంకితమయ్యేలా ఉందని సిని సన్నిహితులు గుస గుసలాడుకుంటున్నారు.