సమంత పై అభిమానులు సీరియస్

56
- Advertisement -

సమంత పై ఆమె అభిమానులు కూడా సీరియస్ అవుతున్నారు. స్టేజిపై విజయ్ దేవరకొండతో డ్యాన్స్ చేసిన సమంత తన పరిధి దాటింది. సెప్టెంబర్ 1న ఖుషీ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో హైదరాబాద్ హైటెక్స్‌ లో ఖుషీకి సంబంధించిన మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘హే నువ్వు నేను తాకితే..’ అనే పాటకు స్టేజిపై సామ్ – విజయ్ డ్యాన్స్ చేశారు. చేస్తే చేశారు.. కానీ ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా స్టేజిపైకి ఎక్కగానే విజయ్ షర్ట్ విప్పి.. సమంతను పట్టుకొని తిప్పుతూ రొమాంటిక్‌గా స్టెప్పులు వేయడం అక్కినేని ఫ్యాన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. సమంతకి అసలు క్యారెక్టర్ లేదు అని, బజారు దానిలా సమంత బిహేవ్ చేస్తోందని.. చైతు ఆమెను వదిలి పెట్టి మంచి పని చేశాడు అని నెటిజన్లు మేసేజ్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత మాత్రం విడాకులు తర్వాత మరింతగా రెచ్చిపోతుంది.

అన్నట్టు స‌మంత చాలా రోజుల నుంచి మ‌యోసైటిస్ అనే వ్యాధితో బాధ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని హెల్త్ స‌రిచేసుకునే ప‌నిలో ప‌డ్డ స‌మంత నిన్న ఖుషి మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్‌కి హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫ్యాన్స్ కోసం హార్డ్‌వ‌ర్క్ చేస్తున్నాను. తిరిగి హెల్తీగా వ‌స్తాను. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తాన‌ని ప్రామిస్ కూడా చేసింది. సరే.. కష్టపడి నటించి మెప్పిస్తే మంచిదే.. కానీ నటన పేరుతో ఐటమ్ బ్యూటీలా రెచ్చిపోతేనే చూసే వారికి నచ్చదు.

Also Read:TTD:విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మప్రచారం

- Advertisement -