టాలీవుడ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర తిరగరాస్తోంది. ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ మల్టీస్టారర్ మూవీ మొదిటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇక ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉండే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ సన్నివేశాల్లో వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ఇలా వేరే లాంగ్వేజ్ ఉంటే వాటికి కింద తెలుగు సబ్ టైటిల్స్ ఇస్తారు. లేదా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వారి వాయిస్ ని మ్యూట్ చేసి వెనకాల వేరే వాయిస్ తో డైలాగ్ తెలుగులో చెప్తారు.
సినిమా మొత్తం మీద 15 నిమిషాలకు పైగానే ఇంగ్లీష్ డైలాగ్స్ ఉన్నాయి. ఈ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కి అర్ధం అవ్వట్లేదు అని కంప్లైంట్. వాటికి కనీసం సబ్ టైటిల్స్ అయినా ఉండాలి అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.