ఐపీఎల్ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక అలర్ట్‌..

238
Go on, Tweet to unlock your favourite player's emoji..
Go on, Tweet to unlock your favourite player's emoji..

క్రికెట్‌ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజ‌న్ మ‌ళ్లీ మొద‌లైంది. బుధ‌వారం నుంచే 10వ సీజ‌న్ స్టార్ట్ కానుంది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా మొద‌టి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. హోమ్ టీమ్ హైద‌రాబాద్‌తో బెంగుళూర్ త‌ల‌ప‌డ‌నుంది. ఫైనల్ మ్యాచ్‌ను కూడా హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు. ఉప్ప‌ల్ స్టేడియంలో మొత్తం 8 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ipl

ఇక సోషల్ మీడియాలో సందడి చేయడానికి స్టార్‌ క్రికెటర్ల ఎమోజీలు అందుబాటులోకి వచ్చేశాయి. అభిమానుల కోసం ఐపీఎల్‌ నిర్వాహకులు వీటిని విడుదల చేశారు. ‘అభిమానుల కోసం ప్రత్యేక అలర్ట్‌’ అంటూ నిర్వాహకులు సోషల్‌మీడియాలో తెలిపారు. స్టార్‌ ఆటగాళ్ల ట్విటర్‌ ఎమోజీలను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, ధోనీ, రోహిత్‌ శర్మ, గౌతమ్‌ గంభీర్‌, సురేశ్‌ రైనా, స్టీవ్‌ స్మిత్‌, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్ల ఎమోజీలు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి.

హైదరబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం సాయంత్రం జరిగే ఆరంభ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా రానున్నారు. 7 గంటలకు మైదానంలో సన్‌రైజర్స్‌, బెంగళూరు ఆటగాళ్ళ వార్మప్‌ మొదలవుతుంది. 8 గంటలకు హైదరాబాద్‌-బెంగళూరు జట్లు తలపడనున్నాయి.