‘ఎఫ్‌పీఎల్‌’ను ప్రారంభించిన టీ న్యూస్‌ ఎండీ

279
Famous Premier League Started
- Advertisement -

మ‌న‌కు అనుకోకుండా ఒక్క సెల‌బ్రేటి ఎదురుగా క‌నిపిస్తే ఆ ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేం. వాళ్లంద‌రూ ఒకేసారి గ్రూప్‌గా సంద‌డి చేస్తే…అది దేశంలో అత్యధికంగా ఆరాధించే క్రికెటైతే ఆ మజానే వేరు. అలాంటి వేడుకకు సిద్ధమైంది హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం. నాలుగు రాష్ట్రాలకు చెందిన దక్షిణ భారత సినీ, టీవీ కళాకారులు….ఫేమస్‌ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొని సందడి చేయనున్నారు. ఈ సెలబ్రేటి ప్రీమియర్‌ లీగ్‌ను టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ ప్రారంభించారు.

Famous Premier League Started

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ టీవీ కళాకారులను నాలుగు సెలబ్రెటీ టీంలుగా రెండు గ్రూపుల్లో పాల్గొననున్నారు. గ్రూప్ ఏలో నంద కిశోర్ క్యాప్టన్‌గా (తెలుగు థండర్స్), వివేక్ (తమిళ థలైవాస్), గ్రూప్ బిలో కిశోర్ సత్యా (మలయాళీ హీరోస్), అలకానంద క్యాప్టెన్సీలో (కన్నడ కింగ్స్) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈనెల 25న సాయంత్రం 4 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రీడల ద్వారా వచ్చే డబ్బును సామాభికాభివృద్ధి, సహాయ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కిషన్ రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Famous Premier League Started

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, రక్తదాన ఆవశ్యకతలను గురించి ప్రజలకు తెలియజేసి.. వారికి కావాల్సిన వినోదాన్ని ఇవ్వడానికి ఎఫ్‌పీఎల్‌ (ఫేమస్‌ ప్రీమియర్‌ లీగ్‌) ద్వారా వివరించనున్నారు. వచ్చే సంవత్సరం ఎఫ్‌ఫీఎల్ సెలబ్రెటీ లీగ్ పేరుతో మహిళా, పురుష నటీనటులతో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు.

- Advertisement -