ఫ్యామిలీ స్టార్ సెన్సార్ రిపోర్ట్..

22
- Advertisement -

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పూర్తయింది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది ఫ్యామిలీ స్టార్.

ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు..నాలుగు డైలాగులను మ్యూట్ చేసింది. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్స్ ఏమి లేవు. ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని మేకర్స్‌కు తెలిపింది. అలాగే బూతు అర్ధం వచ్చే నాలుగు డైలాగ్‌లను తొలగించింది సెన్సార్ బోర్డు.

గీత గోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న రెండో చిత్రమిది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ కానుండగా హిందీలో రెండు వారాల తర్వాత విడుదల చేయనున్నారు. జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వాసుకి, అచ్యుత్ కుమార్ సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు.

Also Read:KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

- Advertisement -