ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు

13
- Advertisement -

ఫాల్కాన్ స్కాంపై ఈడీ కేసు నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేయగా మొత్తం రూ.1700 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టింది ఫాల్కన్.

ఒక్క హైదరాబాదులోనే రూ.850 కోట్లు వసూలు చేసింది ఫాల్కన్ సంస్థ. పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించింది ఈడీ. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసింది ఫాల్కన్.

22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నగదు మళ్ళించినట్లు గుర్తించగా దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు డబ్బును పంపించినట్లు గుర్తించారు. కేసు నమోదు కాగానే చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ కి పారిపోయారు చైర్మన్ అమర్ దీప్ కుమార్.

Also Read:పసుపు బోర్డుకు చట్టబద్ధత ఏది?:ఎమ్మెల్సీ కవిత

- Advertisement -