తన అందం అభినయంతో ఇటు బుల్లితెర..అటు వెండితెరపై ప్రేక్షకులను ఫిదా చేస్తున్న బ్యూటీ అనసూయ. ఓ వైపు సినిమాలు మరోవైపు జబర్దస్త్ లాంటి షోలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి సోషల్ మీడియాలో లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.
దీనిని క్యాష్ చేసుకుంటున్న కొంతమంది అనసూయ పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనసూయపై అభ్యంతరకరమైన పోస్టులు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ (పీవైఎల్) హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
అనసూయ భరద్వాజ్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యంగా రాస్తున్నారని, యాప్‌ల సాయంతో ఆమె వ్యక్తిగత పోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలపై సోషల్‌మీడియాలో అశ్లీల, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. పీవైఎల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.