ఐబొమ్మ రవికి ఉద్యోగం ఆఫర్ చేశామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను పూర్తిగా అసత్యమన్నారు సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు . పోలీసులు ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని, ఈ వార్తలు పుకార్లేనని స్పష్టం చేశారు. ఐబొమ్మ రవి ఎనిమిది రోజుల పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ, చాలా ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన తెలిపారు. విచారణలో అతను కొన్ని విషయాలకు మాత్రమే స్పందించాడని, కీలక ప్రశ్నలకు మాత్రం తప్పించుకున్నాడని పేర్కొన్నారు.
అరవింద్ బాబు మాట్లాడుతూ…రవికి తాను చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. విచారణలో అతను మూడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు నిర్ధారించామని వెల్లడించారు. ఈ యాప్స్ ప్రమోషన్ ద్వారా రవికి జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఇంకా సంపూర్ణంగా బయటకు రాలేదని తెలిపారు. రవికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఎలాంటి ఒప్పందాలతో ప్రోత్సహించబడాడు? డబ్బు చలామణీ ఎలా జరిగింది? అనే అంశాలను ఇంకా లోతుగా పరిశీలించాలని డీసీపీ చెప్పారు.
ఆర్థిక వివరాలు, డిజిటల్ లావాదేవీలు, స్పాన్సర్‌షిప్‌లు, ప్రమోషన్ ఒప్పందాలపై మరిన్ని సాక్ష్యాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. కేసును పూర్తిగా విచారించి నిజాలను బయటపెట్టే దిశగా సైబర్ క్రైం బృందం కృషి చేస్తోందని డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు.
Also Read:సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించాకే H-1B వీసాలు!

