‘పుష్ప’రాజ్‌కు విల‌న్‌ దొరికాడు..

324
Fahadh Faasil
- Advertisement -

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’‌.ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో కలపను అక్ర‌మంగా రవాణా చేసే పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా విష‌యంలో చాలా రోజులుగా కొన‌సాగుతోన్న స‌స్పెన్స్‌కు మైత్రీ మూవీ మేక‌ర్స్ తెరదించారు.

ఈ చిత్రంలో విల‌న్ ఎవ‌రన్న విష‌యాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు ప్ర‌క‌టించింది.మలయాళ నటుడు ఫవాద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతూ ఆయ‌న ఫొటోను మైత్రిమూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. కేర‌ళ‌లో అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. అందుకే ఈ సినిమా కోసం మ‌ల‌యాళ న‌టుడినే విల‌న్‌గా ఎంపిక చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది.

- Advertisement -