మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

4
- Advertisement -

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఈ మేరకు ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్‌ను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సీఎంగా ఫడ్నవీస్‌ ఎంపిక కాగా రేపు ముంబైలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా హాజరుకానున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి 288 స్థానాలకు గాను 230 గెలుచుకున్న సంగతి తెలిసిందే.బీజేపీ 148 స్థానాల్లో పోటీ చేసి 132 చోట్ల విజయం సాధించింది. అయితే శివసేన నేతలు ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. కూటమికి షిండేనే నాయకత్వం వహించారని ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు.

దీంతో మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిని డిసైడ్ చేయడానికి స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Also Read:CPI: ప్రజాపాలన సిస్టమ్ ఫెయిల్

- Advertisement -