మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో అధికారులు హెలికాప్టర్‌ను సురక్షితంగా రోడ్డుపై ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. సీఎం ఫడ్నవిస్, ఇతర అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ కూలిన ఘటన వల్ల మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కుడి చేతికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తున్నది.
ప్రమాదం జరిగిన వెంటనే తాము క్షేమంగా ఉన్నట్లు ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.మా హెలికాప్టర్ లాతూర్ సమీపంలో ప్రమాదానికి గురైందన్నారు. ఫైలట్ అప్రమత్తమవడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. దేవుని దయ, మహారాష్ట్ర ప్రజల వల్ల తాను క్షేమంగా ఉన్నట్లు సీఎం చెప్పారు. తనతో పాటు ఉన్న చేతన్ పాతక్ అనే వ్యక్తికి గాయాలైనట్లు సీఎం తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. సీఎం ఫడ్నవిస్ యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేసిన ఘటనపై ఫడ్నవిస్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఫడ్నవిస్ సురక్షితంగా బయటపడటం పల్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఫైలట్లు సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదం జరుగకుండా చూసిన తీరును సీఎం కేసీఆర్ అభినందించారు.
T 2435 – Helicopter carrying CM Maharashtra, Shri Devendra Fadnavis, crashes .. all safe .. video of the crash !! A providential escape !! pic.twitter.com/nsUPrdNh8l
— Amitabh Bachchan (@SrBachchan) May 25, 2017