- Advertisement -
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ర్ జూకర్‌బర్గ్ కు భారీ షాక్ తగిలింది. ఒక్కసారిగా తన ఫేస్‌బుక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాంతో జూకర్‌బర్గ్ కు 5.1 బిలియన్ డాలర్లు(సుమారు రూ.33వేల కోట్లు) నష్టం వాటిల్లింది.
దీనికి కారణం అమెరికా ఎన్నికల ప్రచారమే. ప్రకటనలకు సంబంధించిన డేటాa సంస్థ కేంబ్రిడ్జ్ అనలైటిక్ కోట్లాది మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని ఓ యాప్ సాయంతో అనుమతి లేకుండా చోరీ చేసిందని స్వయంగా ఫేస్ బుక్ ప్రకటించింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి సహకారం అందించింది ఈ ప్రకటనల సంస్థే. ఈ సంస్థ ఏకంగా 5కోట్ల మంది వివియోగదారుల ఫేస్‌బుక్ డేటాను దుర్వినియోగం చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం ఫేస్ బుక్ లో 16 శాతంగా ఉంది. నష్టం తర్వాత జూకర్‌బర్గ్ సంపద 69.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
- Advertisement -