ఫేస్ బుక్ మెసెంజర్‌లో కొత్త ఫీచర్లు..

503
- Advertisement -

సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఫేస్ బుక్… దీని గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ విడ‌మ‌రిచి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ఫెస్‌ బుక్‌ మెసెంజర్‌ గురించి కూడా అందరికి తెలిసిందే. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త టెక్నాల‌జీల‌ను అందిపుచ్చుకుంటూ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ యాప్స్‌. ఇప్పుడు ఫేస్ బుక్ మెసెంజర్‌లో యూజర్లుకు పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

Facebook

ఇకపై యూజర్లకు మెసెంజర్‌లో బూమెరాంగ్ వీడియోలకు సపోర్ట్ లభిస్తుంది. అలాగే కొత్తగా సెల్ఫీ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో యాప్‌లోని కెమెరా ద్వారా సెల్ఫీలు తీసుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఆటోమేటిక్‌గా బ్లర్ అవుతుంది. అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చిన అగ్‌మెంటెడ్ రియాలిటీ ఫీచర్ సహాయంతో మెసెంజర్‌కు చెందిన స్టిక్కర్లను ఫొటోలు, వీడియోలపై ఏర్పాటు చేసుకోవచ్చు. కాగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్లు ప్రస్తుతం యూజర్లకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై లభిస్తున్నాయి.

- Advertisement -