- Advertisement -
ఇండియాలో ఫేస్ బుక్, వాట్సాప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ ద్వారా ఫేక్ న్యూస్, విద్వేషపూరిత భావజాలన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఈ మాధ్యమాల ద్వారా ఓటర్లను కూడా ప్రభావితం చేస్తున్నారని….. చివరికి ఫేస్ బుక్ బండారం అమెరికా మీడియా బయటపెట్టిందని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఇవాళ అన్ని పత్రికలు వార్తలను ప్రచురించగా ఈ వార్తలపై స్పందించింది ఫేస్ బుక్. హింసను ప్రేరేపించే ఫేక్ న్యూస్, ద్వేషపూరిత సంభాషణ ,కంటెంట్‌ను అనుమతించమని ఇది తమ పాలసీ అని తెలిపింది. ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పాలసీతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
- Advertisement -