ఫేస్‌ బుక్‌…హ్యాక్‌

263
facebook
- Advertisement -

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. దాదాపు 5 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్స్‌ యాక్సెస్ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరి చేశారు. దీని ద్వారా ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని చూడొచ్చు. ఈ లోపాన్ని గుర్తించి సరిచేశామని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు.

ఇతరుల ఖాతా వివరాలను తెలుసుకునేందుకు వీలు కల్పించే వ్యూ ఆజ్‌ ఫీచర్‌లో లోపం ఉందని ఈ ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. హ్యాకింగ్ ఘటనపై ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేశామన్నారు. యూజర్స్‌ ఖాతాలేవైనా దుర్వినియోగమయ్యాయా అన్న సంగతి ఇంకా తెలియదన్నారు.

గతంలోనూ లీక్‌ల బెడద ఫేస్ బుక్‌కు తప్పలేదు. యూజర్ల డేటాను లీక్ చేసినట్లు ఆరోపణలు రావడం…జూకర్ కూడా పొరపాటు జరిగినట్లుగా ఒప్పుకున్నారు. అంతేగాదు లీకేజీ వ్యవహారంతో ఫేస్‌ బుక్‌కే కాదు జూకర్‌కు కూడా భారీ స్ధాయిలో నష్టపోయారు. లీక్‌ల వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న యూజర్లు వేల సంఖ్యలో ఫేస్ బుక్‌ అకౌంట్ ను డిలీట్ చేశారు. తాజాగా హ్యాకింగ్ వ్యవహారంతో ఫేస్‌ బుక్‌ మరింతగా నష్టపోయింది.

- Advertisement -