పాండమిక్ తర్వాత ఫ్యామిలీతో థియేటర్‌కు వచ్చిఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ తెలియజేసారు ఎఫ్3 టీం. ఈ శుక్రవారమే విడుదలైన ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎఫ్ 3 యూనిట్ ఆదివారంనాడు హైదరాబాద్ లోని థియేటర్లో పర్యటించింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, నేను చాలా రోజుల తర్వాత ఎఫ్3లో ఇలా కనబడ్డాను. అనిల్ రావిపూడి నాకు అవకాశం ఇచ్చారు. మీరందరూ కుటుంబంలో ప్రతి వారికి చెప్పి, మరోసారి కరోనా వేవ్ రాకుముందే అందరూ సినిమా చూడండి అంటూ పేర్కొన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, రెండేళ్ళనాడు ఎఫ్3 మొదలుపెట్టినప్పుడు థియేటర్ లో అందరూ పిల్లలతోసహా కుటుంబం నవ్వుతుంటే థియేటర్ లో స్పీకర్లు దద్దరిల్లాలని అనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. పాండమిక్ వచ్చాక అందరూ థియేటర్ కు దూరమయ్యాం. ఆర్.ఆర్.ఆర్. అందుకు ఊపిరిపోసింది. ఎఫ్3తో మరలా అందరూ థియేటర్ కు రావడం చూస్తుంటే మాకు ఎనర్జీ వచ్చింది. వెంకటేష్, వరుణ్ సంక్రాంతి అల్లుళ్ళుగా ఎఫ్2 తో మీ ముందుకు వస్తే, సమ్మర్ సోగ్గాళ్ళుగా ఇప్పుడు ఎఫ్3 తో వచ్చారు. మీరు హిట్ ఇచ్చారు. సినిమాను మళ్ళీ మళ్ళీ చూడండి కుటుంబంతో చూడండి. నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని నవ్వించడానికే. టార్గెట్ రీచ్ అయ్యాం. కలెక్షన్ల పరంగా చాలా హ్యాపీగా వున్నాం. దిల్‌రాజుగారు ఆ జోష్ తోనే అమెరికా వెళ్ళారు. ఈ వారంలో మరలా మేం మీ అందరినీ కలుస్తాం అని అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ, హాయ్.. హాయ్.. అంటూ ప్రేక్షకులను విష్ చేస్తూ.. ఎలా వుందంటూ అడగడంతో.. ప్రేక్షకులంతా సూపర్ అన్నారు. నేను థియేటర్ లోపలికి వచ్చేముందు మీ అందరినీ చూసి షాక్ అయ్యాను. ఇంతమంది వచ్చినందుకు థ్యాంక్స్. ముందుగా అనిల్ రావిపూడి కి థ్యాంక్స్ చెబుతున్నా. నత్తితో నన్ను చేయించారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బయట పిల్లలు, ఫ్యామిలీ ఎఫ్3 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. బయట అందరూ ఇరగదీశావ్ అంటున్నారు. సమ్మర్ లో మంచి ఫ్యామిలీ సినిమాగా ఎఫ్3 నిలిచింది. మీ అందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నాను. అంతకంటే ఎక్కవ చెప్పలేను. అందరూ కుటుంబంతో సినిమా చూడండి. అందరికీ మరోసారి థ్యాంక్స్ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, అయ్యబాబోయ్ ఈ జనాలేంటి? ఈ ప్రేక్షకుల హుషారెంటి? ఎఫ్3 సూపర్ డూపర్ హిట్. అదిరిపోయిందిగదా.. అంటూ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇలా కుటుంబంతో అందరూ చూడాలని సినిమా తీశాం. చాలా సంతోషంగా వుంది. సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీతో వచ్చి హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్యాండమిక్ తర్వాత అందరూ థియేటర్ కు రావాలని కోరుకున్నాం. ఈ సినిమా బాగుందని అందరికీ చెప్పాలి. ఎఫ్3 సినిమాను అనిల్ తీయడం, దిల్‌రాజు, శిరీష్ నిర్మించడం, బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన నా అభిమానులకు, మెగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.