వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. కరోనా కారణంగా అగిపోయిన షూటింగ్ తాజాగా మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘నేను అభిమానించే నా కో-బ్రదర్స్‌తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..’’ అని అనిల్ రావిపూడి తన ట్వీట్లో పేర్కొన్నారు. హీరో వరుణ్ తేజ్ కూడా ‘లవ్లీ టీమ్‌తో మళ్ళీ వర్క్ మొదలైంది..’ అని తెలుపుతూ.. లొకేషన్లోని పిక్‌ని షేర్ చేశారు.
ముందుగా వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా ఏ స్థాయిలో సందడి చేసిందన్నది తెలిసిందే. పూర్తి వినోదభరితమైన కథాంశంతో ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించగా వసూళ్ల వర్షం కురిసింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆయన ‘ఎఫ్ 3’ చేస్తున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదించమని భార్యలు పెట్టే పోరును తట్టుకోలేని భర్తల చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ‘ఎఫ్ 2’కు మించి ఈ సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పడం వలన, మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ‘సంక్రాంతి’కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.