‘ఎఫ్ 3’ సెన్సార్ పూర్తి..

75
F3
- Advertisement -

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌ బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్నది.

ఈ నేపధ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్‌తో ఈ సినిమాకి క్లీన్ యూ (U) సర్టిఫికేట్ వచ్చిందని మేకర్స్ తెలిపారు. అంతేకాదు, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎఫ్ 3 సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. చాలాకాలం తర్వాత క్లీన్ అండ్ హెల్తీ ఎంటర్టైనర్‌ను వీక్షించినట్లు చెప్పారట. మొత్తానికి సెన్సార్ వారు కూడా పాజిటివ్‌గా చెప్పడంతో హిట్ అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. కాగా, ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో హైలైట్‌గా నిలవనుంది.

- Advertisement -