అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. విడుదలైన తొమ్మిదో రోజుకు రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి సత్తాచాటింది. విడుదలైన తర్వాత కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఏమాత్రం తగ్గించడం లేదు చిత్రయూనిట్. అంతేగాదు సాధారణంగా ఏదైన సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఎఫ్3ని మాత్రం 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తామని మేకర్స్ తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రేక్షకుల సపోర్ట్‌తోనే ఈ విజయం సాధ్యమైందని ఎఫ్4 కోసం వెయిట్ చేయాలని కోరారు నిర్మాత దిల్ రాజు. ఎఫ్ 3 సినిమాపై ప్రేక్షకులు చూపిన ఆదరణే మాకు వంద కోట్లతో సమానం అని వరుణ్ తేజ్ అన్నారు. ఈ సినిమా విజయం ఘనత ప్రేక్షకులకే దక్కుతుందని తెలిపారు.