ఎఫ్3 ఓటీటీ డేట్ ఫిక్స్!

34
F3
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్‌3. ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించగా, మరోసారి తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలో ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచివసూళ్లను రాబట్టింది.

ఇక తాజాగా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను జూలై 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ను ఇప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ పీర్జాదా, సోనాల్ చౌహాన్ హరీయిన్లుగా నటించగా,త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది.

- Advertisement -