- Advertisement -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని మే9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమాలో ఎఫ్2లోని నటీనటులు అందరూ నటిస్తుండగా, కొత్తగా సోనాల్ చౌహాన్, సునీల్ జాయిన్ అయ్యారు.
ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే తాజాగా ఈ ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తి చేశారు . ఈ ట్రైలర్ రన్‌టైమ్ 2 నిమిషాల 32 సెకన్లుగా కట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.
- Advertisement -