ఎఫ్‌3 రిలీజ్ డేట్ ఛేంజ్!

95
may 27
- Advertisement -

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌లిసి మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ ఎఫ్‌3తో ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని న‌వ్వుల‌లో ముంచెత్త‌డానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని తొలుత ప్రకటించారు.

అయితే తాజాగా రిలీజ్ డేట్ ఛేంజ్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు. మే 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని వెల్లడించారు. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు

- Advertisement -