ఎఫ్‌3..మూడు రోజుల వ‌సూల్లెంతో తెలుసా..?

61
F3
- Advertisement -

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్‌,వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం ఎఫ్‌3. తొలి రోజు నుండే మంచి టక్ రాబ‌ట్టిన ఈ చిత్రం వ‌సూళ్ల‌లోనూ స‌త్తాచాటుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మూడు రోజుల్లో గ్రాస్ వ‌సూళ్ల ప‌రంగా 50 కోట్ల మైలు రాయిని క్రాస్ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 27.51 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాల్లో క‌లిపి రూ. 1.80 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్ సీస్ రూ.5.20 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఏరియాల వారిగా మూడు రోజుల వ‌సూళ్ల‌ను ప‌రిశీలిస్తే…నైజాం – రూ. 12.20 కోట్లు,సీడెడ్ – రూ. 3.59 కోట్లు, ఉత్త‌రాంధ్ర – రూ. 3.32కోట్లు,ఈస్ట్ – రూ. 1.88 కోట్లు, వెస్ట్ – రూ. 1.54 కోట్లు,గుంటూరు – రూ. 2.06 కోట్లు, కృష్ణా – రూ. 1.77 కోట్లు,నెల్లూరు – రూ. 1.15 కోట్లు రాబ‌ట్టింది.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్ అంద చందాల‌కు తోడుగా సోనాల్ చౌహాన్ గ్లామ‌ర్ కూడా తోడు కావ‌డంతో సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

- Advertisement -