ఈ కూలీలు ఎవరో తెలుసా..?

255
- Advertisement -

టాలీవుడ్‌ టాప్‌ హీరోలు వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్‌ రాజు నిర్మాణ సారధ్యంలో, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మాస్‌ అండ్‌ కామెడి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ థాయిలాండ్‌లో శరవేగంగా సాగుతోంది. అయితే దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌లో చేశాడు. ఆ ఫోటోలో ఈ సినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోలకు సంబంధించిన హీరోల చేతులు మాత్రమే కనబడుతున్నాయి.

f2 movie

అందులో ఒక‌రి చేతికి ఉన్న బ్యాడ్జిపై కూలీ నెం 1 అని ఉండ‌గా, మ‌రో బ్యాడ్జిపై కూలీ 786 అని ఉంది. దీంతో ‘కూలీ నెం.1’ అనే చిత్రం వెంకటేశ్ చేశాడు కాబట్టి ఈ సారి ఆ బ్యాడ్జ్‌ని వ‌రుణ్ కి ఇచ్చాడ‌ని కూలీ 786 అనే బ్యాడ్జ్‌ని వెంకీ తీసుకున్నాడ‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ పోస్ట్‌ను బట్టి చూస్తే ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో కూలీలుగా నటిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్‌ తేజ్‌ సరసన మెహరీన్‌ నటిస్తోంది.

- Advertisement -