స్టాఫ్ కు స‌ర్ ప్రైజ్ ఇచ్చిన దిల్ రాజు

234
Dil-Raju
- Advertisement -

సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది ఎఫ్ 2 మూవీ. యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈచిత్రాన్ని తెర‌కెక్కించ‌గా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఉహించ‌ని విధంగా ఈచిత్రం భారీ విజాయ‌న్ని సొంతం చేసుకోవ‌డంతో పాటు రికార్డు స్ధాయిలో వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఈసినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 60కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈమ‌ధ్య కాలంలో దిల్ రాజు సినిమాల్లో అత్య‌ధిక లాభాలు తీసుకువ‌చ్చిన సినిమాల్లో ఎఫ్ 2 నిలిచింది.

f2

ఉహించ‌ని విధంగా లాభాలు రావ‌డంతో దిల్ రాజు త‌న స్టాఫ్ కు స‌ర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడ‌ని స‌మాచారం. హైదరాబాద్ మరియు వైజాగ్ ఆఫీస్ లలో వర్క్ చేసే కీలకమైన 20 మంది స్టాఫ్ ను బ్యాంకాక్ టూర్ కు పంపిస్తున్నాడట. 20మందిని బ్యాంకాంక్ టూర్ కి పంపించ‌డం అంటే దాదాపు 60 నుంచి 70ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది.

ఎఫ్ 2 కు వస్తున్న లాభాలను పరిగణలోకి తీసుకుంటే స్టాప్ బ్యాంకాక్ టూర్ ఖర్చు పెద్ద లెక్కలోకి రాదు. అందుకే దిల్ రాజు స్టాప్ ఆనందం కోసం వారిలో మరింత ఉత్సాహంను నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు త‌న స్టాఫ్ ఇలా స‌ర్ ఫ్రైజ్ ఇవ్వ‌డం ఇదేమి కొత్త కాదు. గతంలో ఆయ‌న చేసిన సినిమాలు విజ‌యం సాధించ‌న‌పుడు కూడా ఇలాంటి గిప్ట్ లు ఇచ్చారు.

- Advertisement -