సీఎం కేసీఆర్‌ కంటి ఆపరేషన్ సక్సెస్

293
KCR talks tough against adulteration
- Advertisement -

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రాథమిక పరీక్షల అనంతరం డాక్టర్‌ సచ్‌ దేవ్‌ నేతృత్వంలోని వైద్య బృందం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్‌ చేసింది. ఈ సందర్భంగా ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారంటూ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డాక్టర్ సచ్‌ దేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అప్పట్లో కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆయన ఎడమ కంటికి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కుడి కంట్లో పొర రావడంతో దాన్ని తొలగించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఇదివరకే వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్న కేసీఆర్ కు వైద్యులు నేడు కంటి ఆపరేషన్ చేశారు.

ఈ ఆపరేషన్‌ కోసం ఈ నెల 1న ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్‌. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశారు. ఆది, సోమవారాలు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు లేకుండా విశ్రాంతి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కు కంటి ఆపరేషన్ జరగనున్న నేపథ్యంలో ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు,  భార్య, కుమార్తె కవిత, కోడలు, మనమళ్లు, మనమరాళ్లు ఢిల్లీకి వెళ్లినట్లుగా సమాచారం. ఆపరేషన్ చేసిన తర్వాత కనీసం వారం పది రోజుల పాటు విశ్రాంతి అవసరం అవుతుందని చెబుతున్నారు.

- Advertisement -